దేశంలో కరోనా వైరస్ ప్రబలి పోతుంది.  గతనెల కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించి అంతకంతగా దాని ప్రతాపం చూపిస్తుంది.  భారత్ లో కరోనా వ్యాప్తి ఇప్పటికీ నియంత్రణలోకి రావడంలేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,463 కేసులు నమోదు కాగా, 60 మంది మృత్యువాత పడ్డారు. భారత్ లో కరోనా(COVID-19)కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువౌతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో సడెన్ గా గత రెండు రోజులుగా కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి.  మహరాష్ట్రలో కరోనా మరీ బీభత్సం సృష్టిస్తుంది.

 

తమిళనాడులో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కొత్తగా 52 మందికి కరోనా ఉన్నట్లు తేలడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,937కు చేరింది. గడచిన 24 గంటల్లో 7,176 శాంపిల్స్‌ టెస్ట్‌ చేశారు. ఇవాళ ఒక్కరోజే 81 మంది కోలుకోగా సోమవారం సాయంత్రం వరకు 1,101మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  భారత్ లో  పలువురు విదేశీయులు  నుంచే జనాలకు  కరోనా సోకినట్లు తెలుస్తోంది.

 

ఈ కొత్త కేసులన్నీ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన కేసులు కావడంతో దీనిపై కేంద్రం సీరియస్ గా దృష్టి సారించింది. తమిళనాడులో  రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా చెన్నైలోనే 500కు పైగా మంది కరోనా బారిన పడ్డారు.  మరోవైపు రాష్ట్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం  పరిశీలించింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ముందు జాగ్రత్తలపై ఆరా తీశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: