కేంద్రం నిర్ణ‌యంతో సంబంధం లేకుండా ఏపీలో మే 3వ తేదీ త‌ర్వాత‌ లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌స‌ర‌త్తు చేస్తున్నారా...?  మే 21వ తేదీ వ‌ర‌కు ఏపీలో లాక్‌డౌన్‌ను పొడిగించేందుకు ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారా..? అంటే తాజా ప‌రిస్థితులు మాత్రం ఔన‌నే అంటున్నాయి. ఈ రోజు ఉద‌యం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల్లో నెల‌కొన్న తాజా ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ముఖ్య‌మంత్రుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధ‌క చ‌ర్య‌లు, లాక్‌డౌన్ అమ‌లు, స‌డ‌లింపులు.. త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. అయితే.. ఈసంద‌ర్భంగా ఆరుగురు ముఖ్యమంత్రులు మాత్రం మే 3వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని కోరారు. ఇందులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను కనీసం మే 21 వరకు పొడిగించాలని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి సూచించారు.

 

అలాగే.. మరో ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి జగన్‌మోహన్ రెడ్డి, గోవా ముఖ్య‌మంత్రి ప్రమోద్ సావంత్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్య‌మంత్రి జై రామ్ ఠాకూర్, మిజోరాం ముఖ్య‌మంత్రి జొరామ్‌తంగా, మేఘాలయ ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మాలు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని సూచించారు. అయితే.. మ‌మ‌తాబెన‌ర్జీ చెప్పిన‌ట్లు తేదీని మాత్రం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి సూచించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే..ఏపీలో  గ‌త రెండు మూడురోజులుగా క‌రోనా వైర‌స్ కేసులు ఎక్కువ సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. ఈరోజు కూడా ఏకంగా 80 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఏపీలో కూడా లాక్‌డౌన్‌ను మే 21వ‌ర‌కు పొడిగించేందుకే జ‌గ‌న్ మొగ్గుచూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌‌ మే 7వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించిన విష‌యం తెలిసిందే. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: