క‌రోనా వైర‌స్ మాన‌వాళి జీవితంలో కీల‌క మార్పులు తెస్తోంది. ఈ మ‌హ‌మ్మారి సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌నిషి కొత్త‌గా ఆలోచిస్తున్నాడు. స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మాట్లాడుతూ..క‌రోనా వైర‌స్ ఎన్నో స‌వాళ్ల‌ను మ‌న‌ముందుకు తెచ్చింద‌ని, ఎన్నో పాఠ‌శాల‌ను నేర్పింద‌ని అన్నారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి మ‌న్న‌లి మ‌నం కాపాడుకోవ‌డానికి కొత్త‌గా ఆలోచించాల‌ని సూచించారు. మోడీ మాట‌ల‌నే స్ఫూర్తిగా తీసుకున్న త్రిపురకు చెందిన మెకానిక్ అద్భుత‌మైన ఐడియాతో నూత‌న ఆవిష్క‌ర‌ణ చేప‌ట్టాడు.

 

క‌రోనాను ఎదుర్కొన‌డానికి మన చేతిలో ఉన్న‌ ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించ‌డం ఒక్క‌టే. దీనికి అనుగుణంగా త్రిపురకు చెందిన ఒక మెకానిక్ బ్యాటరీతో నడిచే సోష‌ల్ డిస్టెన్స్‌ బైక్‌ను త‌యారు చేశాడు. ఈ బైక్‌పై ఉన్న‌ రెండు సీట్ల మ‌ధ్య చాలా దూరం ఉంది. అయితే దీనిపై ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య‌ సామాజిక దూరాన్ని కొనసాగించేందుకు వీలు క‌ల్పించాడు. ఇక ఈ బైక్ సహాయంతో, అతను తన కుమార్తె సహాయం తీసుకొని అవ‌స‌ర‌మైన‌ పనులను చేసుకోవ‌డానికి ఉప‌యోగిస్తున్నాడు. ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఆ బైక్‌పై వెళ్తూ అవ‌స‌ర‌మైన ప‌నులుచేసుకుంటున్నాడు ఆ మెకానిక్‌. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: