భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అంత‌కంత‌కూ పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో న‌మోదు అవుతోంది. దేశ‌వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వ‌ర‌కు కరోనావైరస్ కేసుల సంఖ్య 28,380 కు పెరిగింది. గ‌త 24 గంట‌ల్లో అంటే ఆదివారం సాయంత్రం నుంచి సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు 1,436 పాజిటివ్ కేసులున‌మోదు అయ్యాయి. అయితే మరణాల సంఖ్య 886కు చేరుకుంది. అయితే.. దేశ వ్యాప్తంగా కేవ‌లం 15 జిల్లాల్లో మాత్ర‌మే కొవిడ్‌-19 ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లోనే అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ 15 జిల్లాలు మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్‌, తెలంగాణ‌, ఢిల్లీ రాష్ట్రాల్లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

 

ఇందులోనూ కేవ‌లం 7 జిల్లాల్లో మాత్ర‌మే వైర‌స్ తీవ్ర‌రూపం దాల్చింది. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, మ‌హారాష్ట్ర‌లో పుణె, ముంబై, రాజ‌స్తాన్‌లో జైపూర్‌,  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఇండోర్‌, గుజ‌రాత్‌లో అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ జిల్లాలు ఉన్నాయి.  ఈ విష‌యాన్ని నీతి ఆయోగ్ చీఫ్ అమితాబ్ కాంత్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ 15 జిల్లాల్లో వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌ని, మ‌రింత క‌ట్టుదిట్టంగా ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న సూచించారు. అయితే.. క‌రోనా వైర‌స్‌పై భార‌త్ విజ‌యం కేవ‌లం ఆ ఏడు జిల్లాల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ ఏడు జిల్లాల్లో క‌రోనాను నియంత్రింగ‌లిగితే.. వైర‌స్‌పై భార‌త్ విజ‌యం సాధించిన‌ట్టేన‌ని ఆయ‌న చెప్పారు. ఈ మేర‌కు మ‌రింత ప‌క‌డ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాల‌ని ఆయ‌న సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: