మహారాష్ట్రలో నానాటికి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయ్. దేశం లో మారాష్ట్ర లో ఇప్పటి వరకు మొదటి స్థానానికే పరిమిత మైంది. అయితే ఈ జాబితా లో  ముంబై పోలీస్ లు కూడా చేరారు. ఈ ప్రాంతంలో కరోనా కలకలం రేపుతోంది. గడచిన మూడు రోజుల్లో ఇప్పటి వరకు ముగ్గురు పోలీసులు కరోనా భారీన పడి చనిపోవడం గమనార్హం. ఈ దుర్ఘటన ముంబై వాసులను ఆందోళనలో పడవేసింది. సోమవారం నాడు కరోనా సోకిన ఓ పోలీస్ కానిస్టేబుల్ క్వారంటైన్ లో చికిత్సపొందుతూ చనిపోయాడు.

 

IHG

అతను కుర్లా ట్రాఫిక్‌ డివిజన్‌లో పనిచేసే హెడ్‌ కానిస్టేబుల్‌ శివాజీ సోన్వానే (56)గా గుర్తించారు. కరోనా విధుల కోసం ప్రధాన హాట్‌స్పాట్స్‌లో ఒకటైన ఎల్‌-వార్డ్‌ (కుర్లా డివిజన్‌)లో సోన్వానే విధులు నిర్వర్తించారు. కానిస్టేబుల్‌ శివాజీ సోన్వానే క్వారంటైన్ లో చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని పోలీస్ యంత్రాంగామ్ ప్రార్థనలను చేసింది.  ఇక ఈ వైరస్‌ బారినపడి చికిత్స పొందుతూ వకోలా పీఎస్‌లో పనిచేసే కానిస్టేబుల్‌ చంద్రకాంత్‌ పెండూకర్‌, కానిస్టేబుల్‌ సందీప్‌ సర్వ్‌లు కూడా గత రెండు రోజుల్లో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: