ఈషాగుప్తా గుర్తుంది క‌దా.. బాలీవుడ్ బ్యూటీ.. ఈ అమ్మ‌డు వీడెవ‌డు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులను ప‌లుక‌రించింది. ఆ త‌ర్వాత రాంచ‌ర‌ణ్ న‌టించిన విన‌య విధేయ రామలోని ఎక్ బార్ సాంగ్‌లో త‌ళుక్కున మెరిసింది. ఇక బాలీవుడ్‌లోనూ ప‌లు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. జ‌న్న‌త్‌-2, క‌మాండో-2, రుస్తుం, బాద్ షాహో వంటి హిట్ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఈ భామకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండ‌స్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

 

అదేమిటంటే.. ఒక‌రితో రిలేష‌న్ షిప్‌లో ఉంద‌ట‌. ఈ విషయాన్ని ఈషా గుప్తానే స్వయంగా వెల్ల‌డించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. ఈషా గుప్తా త‌న భాయ్ ఫ్రెండ్ మాన్యుయెల్ గువాల్ల‌ర్‌తో క‌లిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఐ ల‌వ్ యూ సో మ‌చ్‌..మై ల‌వ్ అంటూ దానికొక‌ క్యాప్ష‌న్ కూడా ఇచ్చేసింది ఈ బ్యూటీ. మాన్యుయెల్ బ్లాక్ అండ్ వైట్, ఈషా గుప్తా బ్లాక్ కాస్ట్యూమ్స్ లో ఒక‌రి చేతిని మ‌రొక‌రు క్లోజ్ గా ప‌ట్టుకుని ఉన్న ఫొటో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: