జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మార్చింది. ఆ పేరు స్థానంలో మెట్రో పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారుస్తూ జీవో విడుదల చేసింది. రాష్ట్రంలో చేప‌ట్టే మోట్రో ప్రాజెక్టు సౌల‌భ్యం కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు కూడా జీవోలో పేర్కొంది. అలాగే విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌కు కూడా అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్ట్ పేరు ఉండటంతో మరో కారణంగా చెప్పుకొచ్చారు.

 

గ‌తంలో నాగ్‌పూర్ మెట్రో ప్రాజెక్టు పేరును సైతం మ‌హారాష్ట్ర రైల్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌గా మార్పు చేసిన విష‌యం కూడా ప్ర‌స్తావించారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో.. అమరావతి, విజయవాడ, విశాఖలో మెట్రో నిర్మాణం చేపట్టాలని భావించింది. డీపీఆర్‌పై కసరత్తు చేసింది.. ఇక ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ ప్రాజెక్టుపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్ట‌డంతో పాటు తాజాగా పేరు మారుస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: