దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయినా దేశంలో ఈ ప్రాణాంతకర మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ కారణంగా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొద్ది మంది నిర్లక్ష్యం.. ఢిల్లీ మర్కజ్ ప్రార్థన వల్ల కేసులు పెరిగిపోయాయని చెబుతున్నారు. ఈ మహమ్మారి నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి.

 

తాజాగా సుప్రీంకోర్టులో పనిచేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది . దీంతో సుప్రీం కోర్టు ఇద్దరు రిజిస్ట్రార్ల ను క్వారంటైన్ కు పంపారు. జ్యుడీషియల్ విభాగంలో పనిచేసే ఆ ఉద్యోగి ఈనెల 16న విధులకు హాజరయ్యారు.  కరోనా సోకిన ఉద్యోగి గత వారం రెండుసార్లు కోర్టుకు వచ్చారట . దీంతో కరోనా సోకిన వ్యక్తి ఎవరెవరిని కలిసారనే దానిపై సిబ్బంది విచారణ జరుపుతున్నారు. 

 

కాగా,  16 నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఢిల్లీలో సిబ్బంది మంత్రిత్వ శాఖ శిక్షణ విభాగం అధికారి ఒకరు మరణించారు. దీంతో పాత జేఎన్‌యూ ఆవరణలోని శిక్షణ విభాగం భవనానికి అధికారులు సీల్ వేశారు. కార్యాలయ ఉద్యోగులను కొన్ని రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: