మ‌హేష్‌బాబు - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన పోకిరి వ‌చ్చి నేటితో 14 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే మ‌ర‌పురాని సినిమాగా పోకిరి నిలిచింది. పూరిమాస్ మ‌సాలా ఎంట‌ర్టైన‌ర్‌లో కూడా ఎన్నో ప్ర‌యోగాలు చేశాడు. సెన్సిబుల్ ల‌వ్ స్టోరీ, కామెడీ, యాక్ష‌న్, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఇలా ఎన్నో అంశాలు ఈ సినిమాను సూప‌ర్ డూప‌ర్ హిట్ చేశాయి. ఈ సినిమా చిన్న చిన్న సెంట‌ర్ల‌లో కూడా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా అప్ప‌టి వ‌ర‌కు 75 సంవ‌త్స‌రాల తెలుగు సినిమా రికార్డుల‌ను ఎన్నింటినో తిర‌గ‌రాసింది.   

 

సినిమా త‌ర్వాత మ‌హేష్‌బాబు రేంజ్ , క్రేజ్ మారిపోయాయి. డైరెక్ట‌ర్‌గా పూరి ఎక్క‌డికో వెళ్లిపోయాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి లాంటి వాళ్లు తిరుగులేకుండా దూసుకుపోయారు. పోకిరి 50 నుంచి 300 రోజుల వ‌ర‌కు ఆడిన సెంట‌ర్ల లిస్ట్ ఇదే..

 

50 డేస్ – 300 సెంటర్స్

100 డేస్ – 200 సెంటర్స్

175 డేస్ – 63 సెంటర్స్

200 డేస్ – 15 సెంటర్స్

300 డేస్ – 2 సెంటర్స్

మరింత సమాచారం తెలుసుకోండి: