క‌రోనా క‌ట్ట‌డికి అధికారులు తీసుకుంటున్న చ‌ర్య‌లు కొంత ‌మందికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే.. పేషెంట్‌తో పాటు ప్రైమ‌రీతోపాటు సెకండ‌రీ కాంటాక్ట్ అయిన వారంద‌రినీ అధికారులు గుర్తించి బ‌య‌ట‌కు తీస్తున్నారు. దీంతో క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ వ్య‌క్తి ఎ వ‌రెవ‌రినీ ఎప్పుడెప్పుడు క‌లిశాడ‌నే విష‌యాల‌న్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక క‌రోనా సోకింద‌ని నిర్దార‌ణ అయితే చాలు... ఆ వ్య‌క్తి సంబంధించిన అన్ని ర‌కాల డేటాను బ‌య‌ట‌కు తీస్తున్నారు పోలీసులు. దీంతో త‌ప్పుడు ప‌నులు చేసే వారికి ఇబ్బందులు త‌ప్ప‌డంలేదు. 

ఇటీవ‌ల భోపాల్‌కు చెందిన ఓ అమ్మాయికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్న విష‌యం ఇంట్లోవాళ్ల‌కు తె లి య‌దు. పోలీసులు ఆ అమ్మాయి కాంటాక్ట్ లిస్టు తీయ‌డంతో బాయ్ ఫ్రెండ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకొచ్చి టెస్ట్‌లు చేయ‌గా క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఈ చైన్ ఇంత‌టితో ఆగ‌లేదు. బాయ్ ఫ్రెండ్ కాంటాక్ట్ లిస్ట్ చెక్ చేస్తే అత‌డు మ‌రో అమ్మాయితో ల‌వ్ ఎఫైర్ న‌డుపుతున్న‌ట్లు తేలింది. ఆమెను తీసుకొచ్చి ప‌రీక్షిస్తే... ఆమెకు కూడా పాజిటివ్ అని తేలింది. 

అయితే ఊహించ‌ని రీతిలో మొద‌టి అమ్మాయి ద్వారా మ‌రో అబ్బాయికి కూడా క‌రోనా సోకింది. దీంతో ఆ అమ్మాయి ఇద్ద‌రి అబ్బాయిల‌తో ల‌వ్ ఎఫైర్ న ‌డుపుతున్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇక మ‌రో విచిత్ర‌మైన కేసు కూడా ఇటీవ‌ల వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌తీ రోజు ఆఫీస్‌కు వెళ్తున్న వ్య‌క్తికి క‌రోనా సో కింది. అలాగ‌ని కొలీగ్స్‌తోపాటు ఇంటి చుట్టుప‌క్క‌ల వారికి ఎవ‌రికీ క‌రోనా లేదు. దీనిపై ఆరా తీయ‌గా.. ఈ వ్య‌క్తి ఆఫీస్ ముగిసిన వెంట‌నే సెకండ్ సెట‌ప్ వ‌ద్ద‌కు వెళ్తున్న‌ట్లు తెలిసింది. ఆమెకు టెస్ట్‌లు నిర్వ‌హిస్తే క‌రోనా పాజిటివ్ గా తేల‌డంతో ఇద్ద‌రినీ క్వారంటైన్ కు త‌ర‌లించారు. మొత్తానికి ఇనాళ్లూ గు ట్టుచ‌ప్పుడు కాకుండా సాగిన య‌వ్వారాల‌న్నీ...  ఇప్పుడు క‌రోనా దెబ్బ‌కు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: