సంగీతానికి రాళ్లు కరుగుతాయి.. ప్రకృతి పులకిస్తుంది.. వర్షాలు కురుస్తాయని వింటుంటాం. ఈ సంగీతం ఇప్పటిది కాదు.. వేల సంవత్సరాల నుంచి వస్తుంది.. రక రకాల వాయిద్యాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు సంగీతం కొత్త పుంతలు తొక్కుతుంది.   సినిమాలకు ప్రాణం సంగీతమే అంటారు.. మ్యూజిక్ హిట్ అయితే సినిమా హిట్ అనే అంటారు.  తాజాగా దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.. ఇక సినీ సెలబ్రెటీలు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.  కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నారు. 

 


మూవీ షూటింగ్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దాంతో మెగాస్టార్ చిరంజీవి వైరస్ వ్యాప్తి అరికట్టడానికి ఎన్నో వీడియోలు చేసి ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నారు అంతే కాదు సీసీసీ స్తాపించి విరాళాలు సేకరిస్తూ పేద సినీ కార్మికులను ఆదుకుంటున్నారు.  ఇక ఇంట్లో తన కుటుంబ సభ్యులతో గడుపుతూ ఉన్నారు.  ఆ మద్య తన తల్లిగారికి స్వయంగా దోష వేసిన తినిపించారు.. తాజాగా తన మనవరాలితో ఆడుతూ.. మ్యూజిక పవర్ ఏంటో చెప్పారు.  

 


ఒక ఏడాది వయసున్న తన మనవరాలు కూడా మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తోందని చెప్పారు. పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ మూమెంట్స్ ఇవ్వడానకిి ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ పాట నాదే కాబట్టి... అమ్మమ్మ సురేఖ వద్ద క్రెడిట్ అంతా తనదేనని చెప్పారు.  తాాజాగా తన మనవరాలితో ఎంజాయ్ చేస్తున్న వీడియో ట్విట్ చేశారు మెగాస్టార్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: