యూఎస్ జియోలాజికల్ సర్వే మొట్టమొదటిసారిగా అధికారికంగా చంద్రుడి రోడ్‌మ్యాప్‌ను విడుద‌ల చేసింది. చంద్రుడిపై భ‌విష్య‌త్‌లో చేప‌ట్ట‌బోయే మిష‌న్‌కు సంబంధించిన ఈ రోడ్ మ్యాప్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. చంద‌మామ ఉన్న రాతిపొర‌లు( రాక్ లేయ‌ర్స్‌), బొంద‌లు( క్రేట‌ర్స్‌)తో కూడిన సమగ్రమైన చంద్ర పటాన్ని విడుదల చేసింది. ఈ ప‌టంలో అనేక అంశాలను జియోలాజిక‌ల్ స‌ర్వే పొందుప‌ర్చింది. కాగా, చంద‌మామ అందిన‌ట్టే అనిపిస్తుందిగానీ.. ఇంకా మ‌నిషి మెద‌డుకు అంతుచిక్క‌ని ర‌హ‌స్యాలు ఎన్నో ఉన్నాయి.

 

భూమికి ఉప‌గ్ర‌హంగా ఉన్న‌చంద్రుడికి సంబంధించిన అనేకమైన ఆస‌క్తిక‌ర‌మైన అంశాలను తెలుసుకునేందుకు, అక్క‌డే నివాసం ఏర్ప‌ర్చుకునేందుకు మొత్తంగా చంద‌మామ‌పై ప‌ట్టుకోసం అనేక దేశాలు అనేక ప్ర‌యోగాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో అమెరికా ఎప్పుడూ ముందువ‌ర‌స‌లోనే ఉంటుంది. కొన్ని నెల‌ల కింద‌ట ఇండియా చేప‌ట్టిన చంద్ర‌యాన్‌-2 దాదాపుగా 99శాతం స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే. ఇక తాజాగా విడుద‌ల చేసిన అధికారిక లూనార్‌ రోడ్ మ్యాప్‌తో అమెరికా చేప‌ట్ట‌బోయే మిషన్స్‌పై ఇప్ప‌టి నుంచే అనేక ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: