దేశంలో కరోనా రోజు రోజుకీ విశ్వరూపం చూపిస్తుంది.  ఎక్కడ చూసినా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  అయితే కరోనా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి సోకుతుంది. ముఖ్యంతా చిన్న పిల్లలు, పెద్ద వయసు వారికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.  50 దాటితే షుగర్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఈ కరోనా ప్రభావం తీవ్రంగా చూపిస్తుంది.  తాజాగా ముంబై పోలీసు శాఖ కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ది.  55 ఏళ్లు దాటిన పోలీసులు ఎవ‌రూ విధుల‌కు హాజ‌రుకావొద్దు అని ఆదేశాలు జారీ చేసింది.

 

న‌గ‌రంలో ముగ్గురు పోలీసులు వైర‌స్ బారినప‌డ‌డం వ‌ల్ల పోలీసుశాక ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఈ మేరకు ముంబై పోలీసు చీఫ్ ప‌రంబీర్ సింగ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా, వైర‌స్‌ను సంపూర్ణంగా నియంత్రించేంత వ‌ర‌కు డ్యూటీకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.  ఇదిలా ఉంటే ఈ మద్య చనిపోయిన ముగ్గురు పోలీసులు 50 కి పైపడిన వారు కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

 

55 ఏళ్ల పైబ‌డిన వారికి వైర‌స్ త్వ‌ర‌గా సోకే ఛాన్సు ఉంటుంద‌ని ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ముంబైలో క‌రోనా పాజిటివ్ కేసులు 6వేల‌కు చేరుకున్నాయి. ఆ న‌గ‌రంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 219గా ఉన్న‌ది.  భారత దేశంలో ఎక్కువ కరోనా కేసులు ముంబాయిలోనే నమోదు కావడంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలు గుప్పిట్టలో పెట్టుకొని బతుకుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: