క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కంటికి క‌నిపించ‌ని ఈ మ‌హ‌మ్మారి చూస్తుండ‌గానే మ‌నిషిని మృత్యు ఒడికి చేరుస్తోంది. జ్వ‌రం, ద‌గ్గు, శ్వాస తీసుకోవ‌డం లాంటివి క‌రోనా ల‌క్ష‌ణాలుగా ఇప్ప‌టి వ‌ర‌కు వైద్యులు పేర్కొంటున్నారు.  తాజాగా వాటికి మ‌రిన్ని ల‌క్ష‌ణాలు వ‌చ్చి చే రాయి. రుచి, వాస‌న‌ను గ్ర‌హించ‌లేక‌పోవ‌డం, చ‌లి పుట్ట‌డం, చలితో వ‌చ్చే వ‌ణుకుడు, త‌ల నొప్పి, గొంతులో నొప్పి, మంట‌, కండ‌రాల నొప్పి వంటి ఇబ్బందులు క‌నిపిస్తే ఏమాత్రం అశ్ర‌ద్ద చేయొద్దంటూ హెచ్చ‌రిస్తున్నారు. పై ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే క‌రోనా సోకిన‌ట్లు అనుమానించాల‌ని నిపుణులు పే ర్కొంటున్నారు.

 

ఛాతిలో విడ‌వ‌కుండా నొప్పి వ‌స్తున్నా, పెద‌వులు కానీ, ముఖంకానీ నీలి రంగులోకి మారుతున్నా వెంట‌నే జాగ్ర‌త్త ప‌డాల‌ని, వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు. అమెరికాలోని స్టాన్‌ఫ‌ర్డ్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌లువురు పరిశోధ‌కులు క‌రోనా ల‌క్ష‌ణాల‌పై ఇటీవ‌ల ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. ఈ క్ర‌మంలోనే కొత్త‌గా మ‌రో ఆరు ల‌క్ష‌ణాల‌ను క‌నిపెట్టిన‌ట్లు పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: