దేశంలో కరోనా వైరస్ ప్రభావం అంతకంత పెరిగిపోతూనే ఉంది.  ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. లాక్ డౌన్ అమల్లో ఉన్నా ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంది.  తాజాగా ఢిల్లీ బాబూ జగ్జీవన్ రామ్ ఆసుపత్రిలో 75 మంది స్టాఫ్‌కు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  అంతే కాదు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులకు కూడా పాజిటివ్‌గా తేలింది. ఒకే కుటుంబానికి చెందిన అనేక మంది కరోనా బారిన పడ్డారని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో బీజేఆర్‌ మెమోరియల్‌ ఆస్పత్రిని మూసివేశారు.  

 

ఢిల్లీలోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో కూడా 33 మంది హెల్త్‌ వర్కర్స్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరందరిని మ్యాక్స్‌ సాకేత్‌ కొవిడ్‌-19 వార్డుకు తరలించారు. అయితే మ్యాక్స్‌ ఆస్పత్రిలో పని చేసే 10 వేలకు పైగా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.  కాగా, ఢిల్లీలోని బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆస్పత్రి సిబ్బందిని కూడా క్వారంటైన్‌కు తరలించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో నమోదైన కరోనా పాజిటీవ్ కేసులన్నింటికి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ ప్రాంతంతో సంబంధం ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 

 

ఇక్కడకు వచ్చిన ప్రార్థనాలు చేసినవారిలో చాలామందికి కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువగా కారణం అయ్యారని అధికారులు అంటున్నారు. ఢిల్లీ కరోనా బాధితుల సంఖ్య 3108కి చేరింది. నిన్న ఒక్కరోజే 190 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకూ 877మంది కోలుకున్నారు. 11 మంది వెంటిలేటర్‌పై ఉన్నారు.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: