ప్రేమ పేరుతో  వెంట‌బ‌డ్డాడు... పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మ‌బలికాడు... బాలికను లొంగ‌దీసుకుని... కామ‌వాంఛ తీర్చుకున్నాడు..  తీరా గ‌ర్బందాల్చ‌డంతో ముఖం చాటేశాడు. దీంతో  బాలికను మోసం చేసిన మైనర్ బాలుడిపై ప్రకాశం జిల్లా బేస్తవారపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రవీంద్రారెడ్డి కథనం మేరకు... బేస్తవారపేట మండలానికి చెందిన బాలిక (18), బాలుడు (18) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుం టానని బాలికను నమ్మించిన ఆ బాలుడు ఆమెను లైంగికంగా వాడుకున్నాడు. అనేకసార్లు ఆమెపై లైంగిక‌దాడికి  పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది.

 

ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పి చేసుకోవాలని కోరగా అతడు నిరాకరించాడు. ఆమె గర్భానికి తనకు సంబంధం లేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: