ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని లాంఛ‌నంగా ప్రారంభిం చారు. ఈసందర్భంగా సీఎం  మాట్లాడారు. ‘జగనన్న విద్యా దీవెన’ ప‌థ‌కానికి ప్రేర‌ణ‌గా నిలిచిన ఒక ఘ‌ట‌న‌ను సీఎం గుర్తు చేశారు.  

 

నెల్లూరు జిల్లాలో పా దయాత్ర చేస్తున్నప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో గోపాల్‌ అనే ఒక తండ్రి.. తన ఇంటి ముందు తన కొడుకు ఫొటో పెట్టి నివాళులు అర్పిస్తున్నాడు. అప్పుడు నేను.. ఏమైందన్నా అని అడిగా... అప్పుడు ఆ తండ్రి బాధపడుతూ చెప్పిన విషయాలు ఎప్పుడూ కూడా నేను మరిచిపోలేను. ‘ఇంటర్మీడి యట్‌లో మంచి మార్కులు వస్తే.. ఇంజినీరింగ్‌ చదువుతానంటే కాలేజీలో చేర్పించా. కానీ చాలీ చాలని ఫీజులు ఇచ్చేవారు, మరో వైపు బోర్డింగ్‌ మెస్‌ ఛార్జీలు కలిపితే లక్ష రూపాయలు దాటే పరిస్థితి. బాలెన్స్‌ ఫీజు ఏం చేస్తావు నాన్నా అని నా కొడుకు అడిగాడు. 

 

కొన్ని రోజులుగా అప్పో సప్పోచేసి.. చదవించా. సెలవులకు ఇంటికి రాగానే.. మళ్లీ నా కొడుకు అదే ప్రశ్నలు వేశాడు. ఏదో ఒకటి చేసి చదివిస్తా అన్నాను. కానీ తన చదువు కోసం కొవ్వొత్తిలా తండ్రి, తన కుటుంబం కరిగి పోవడం ఇష్టం లేక ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు’ అని ఆ తండ్రి చెప్పాడ‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. చదువుల కోసం, ఆరోగ్యం కోసం పేదవాడు అప్పులు పాలు అవుతున్నాడ‌ని, ఆ రోజు నేను అనుకున్న కార్యక్రమానికి దేవుడి దయ, అందరి ఆశీర్వాదంతో ఈ రోజు శ్రీకారం చుట్టాన‌ని సీఎం పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: