ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎప్పుడూ ఎదురు కాల్పులు జరుగుతూనే ఉంటాయి.  ప్రస్తుతం ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం బాగానే ఉంది.  గతంలో ఇక్కడ పలుమార్లు భారీ ఎన్ కౌంటర్లు కూడా జరిగిన విషయం తెలిసిందే. మావోయిస్టులకు పెట్టిన కోటగా  సుక్మా జిల్లాలోని తొండమార్కా, దుర్మా, జడేకదేవాల్‌ అటవీప్రాంతాలు అంటారు.  ఆ మద్య  భద్రతాబలగాలు 30 గంటల పాటు ఆపరేషన్‌ ప్రహార్‌ నిర్వహించారు.  ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

 

 

ఎదురు కాల్పులు జరిగిన స్థలం నుంచి మావోలకు చెందిన ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దేవం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటుంది.  ఈ సమయంలో అక్కడక్కడ మావోయిస్టుల కదలికల సమాాచారంతో పోలీసులు మరోసారి కూంబింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం.

 

తాజాగా పోలీసులు చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో  భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుంది.  డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, కోబ్రా సంయుక్తంగా నక్సల్స్‌ ఆచూకీకి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా నక్సల్స్‌కు చెందిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: