డొక్కా సీత‌మ్మ‌.. మాన‌వీయ‌త‌కు ప్ర‌తిరూపం.. అప‌ర అన్న‌పూర్ణ‌.. అన్నార్తుల ఆక‌లితీర్చిన మ‌హాత‌ల్లి.. ఆస్తులు క‌రిగిపోతున్నా.. అడిగిన‌వారిక‌ల్లా దానం చేసిన మ‌హ‌నీయురాలు.. నేడు ఆమె వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా ఆమె సేవ‌ల‌ను కొనియాడుతూ తెలుగువారు స్మ‌రించుకుంటున్నారు. డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో 1841లో జన్మించారు. లంకలగన్నవరంలో కొడ‌లిగా అడుగుపెట్టారామె. అడిగిన వారికి లేదనకుండా ఆస్తులు త‌రిగిపోయినా అన్నదానం చేశారు. ఆమె అన్న దానానికే పరిమితం కాకుండా పేదలకు పెళ్లిళ్లు చేశారు. పేద పిల్ల‌లు చదువుకోవడానికి ఆర్థిక సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

 

సీతమ్మ సేవ‌లు నాడు భారత దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ చక్రవర్తిని కూడా ఆక‌ర్షించాయి. జీవితాంతం సామాజిక సేవ‌లోనే నిమ‌గ్న‌మైన సీత‌మ్మ  1909 ఏప్రిల్ 28న ప‌ర‌మ‌ప‌దించారు. ఈ రోజు ఆమె వ‌ర్ధంతి సంద‌ర్భంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంజ‌లి ఘ‌టించారు. ఆమె సేవ‌ల‌ను కొనియాడుతూ ట్వీట్ చేశారు.  కారణజన్మురాలు సీత‌మ్మ‌ తెలుగు బిడ్డ పుట్టడం తెలుగు వారు చేసిన పుణ్య ఫలం అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆమె సేవ‌ల‌ను కొనియాడారు. డొక్కా సీతమ్మ ఆశయాలను కొనసాగిస్తామని ఆయ‌న‌ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: