భారత దేశాన్ని ఇప్పుడు కరోనా పట్టి పీడిస్తుంది.  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా వైరస్ కేసులు ముప్పై వేలకు చేరువయ్యాయి. గడిచిన 24గంటల్లో 62 మరణాలు, 1,543 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 3,108 చేరింది. ఇప్పటివరకు 54మంది చనిపోయారు. అటు మహారాష్ట్రలో 8,590 చేరాయి కరోనా కేసులు.  ఇప్పటివరకు 30.60లక్షల మందికి కరోనా సోకింది. 2.11లక్షల మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు.

 

ప్రపంచలో 9.21లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  నిన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో కరోనా గురించి మాట్లాడిన విషయం తెలిసిందే.. కరోనా ఎవరికైనా వస్తుంది, పోతుంది.... ఇది భయంకరమైన రోగం కాదు అని సీఎం జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇది నయమైపోతుందని అన్నారు.

 

తాాజాగా ఈ విషయంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ మాట్లాడారు. మనం అనుకుంటున్నట్టు కొవిడ్-19 (కరోనా) సాధారణ జ్వరం కాదు. కొవిడ్-19 వైరస్ కారణంగా రోగుల  ఊపిరితిత్తులకు తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోందని చైనాలో అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.  ఈ మద్యనే తాను 'సైన్స్ న్యూస్' లో వచ్చిన ఈ కథనం  చూశానని అది చదువుకోవాలని ట్వీట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: