IHG' term in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='ap-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ap</a> cut to 2 years

 

 

కరోనా మహమ్మారి  రాకాసి కోరలను దేశ నలుమూలలా విస్తరించుకుంటూ నే పోతూ  ఉంది, గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చి చేరిన పాజిటివ్ కేసులను కలుపుకొని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1259 కేసులు గా నమోదయ్యాయి. అయితే గడచిన 24 గంటల్లో ఒక మరణం కూడా సంభవించే కపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 250 మంది డిశ్చార్జి అయ్యారు. మరియు 31 మంది మరణించారు.  గడచిన 24 గంటలలో కర్నూల్ 40, గుంటూరు 17, కృష్ణా డిస్ట్రిక్ట్ 13, కడప 7, అనంతపూర్ మరియు చిత్తూర్ లలో ఒక్కో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్ కేసులలో కర్నూలు 332 కేసులతో మొదటి స్థానంలో ఉంది.

IHG

 

గుంటూరు 254, కృష్ణ 223 పాజిటివ్ కేసులతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. అయితే విజయనగరం జిల్లా నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులలో అతి తక్కువ నమోదైన జిల్లా మటుకు శ్రీకాకుళం మొత్తం నాలుగు కేసులతో చివరి స్థానంలో ఉంది.  ఏపీలో గడచిన 24 గంటల్లో  5783 శాంపిల్స్ ని పరీక్షించగా 82 మంది కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.  గడచిన 24 గంటలలో 23 మంది కోలుకొని  డిశ్చార్జ్ అయ్యారు వారిలో ముఖ్యంగా కర్నూల్ నుంచి 12, గుంటూరు నుంచి 10, నెల్లూరు నుంచి 1 డిశ్చార్జి అయ్యారు. దీనితో  డిచ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 258 ఈ చేరింది.  కోవిడ్-19 ఆస్పత్రులలో వైద్యుల కొరత ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 1170 డాక్టర్ల నియామకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు ఆప్ ని డౌన్లోడ్ చేసుకుని విలువైన సమాచారాన్ని పొందవచ్చని  విజ్ఞప్తి చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: