ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతిరోజూ రాష్ట్రంలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. మే 3వ తేదీ తరువాత కూడా లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మోదీ దేశవ్యాప్తంగా మరో రెండు, మూడు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని సమాచారం. 
 
లాక్ డౌన్ వల్ల పదో తరగతి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వాయిదా పడ్డాయి. అందువల్ల ప్రభుత్వం పదో తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తివేసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటన చేశారు. భౌతిక దూరం దూరం పాటిస్తూనే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: