క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్లకే ప‌రిమితం అయిపోయారు. హీరోలు, హీరోయిన్లు హాయిగా ఇంటి ప‌నులు చేస్తూ.. కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కొంద‌రు ప్ర‌జ‌ల‌కు క‌రోనా వైర‌స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వీడియోలు చేస్తూ వాటిని సోష‌ల్ మీడియాలో పెడుతున్నారు. మ‌రికొంద‌రు ఫన్నీ వీడియోలు తీసి.. ఎంజాయ్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు వంట‌లు చేస్తున్న వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అల‌రిస్తున్నారు.

 

ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ కూడా కుకింగ్‌ను ఎంజాయ్ చేస్తోంది. వంట చేయ‌డానికి కూర‌గాయలు క‌ట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నిజానికి.. లాక్‌డౌన్ ప్రారంభంలోనూ క‌త్రినా కైఫ్ ఇంటిప‌నులు చేసే వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. తాజాగా వంట చేస్తున్న వీడియో కూడా వైర‌ల్ అవుతోంది. ఇక అమ్మ‌డికి అంద‌రూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. వంట బాగా చేస్తున్నారంటూ కితాబ్ ఇస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసే లోగా మ‌రెన్ని వీడియోలు వ‌స్తాయో చూడాలి మ‌రి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: