ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకూ 83334 టెస్టులు చేయగా 79075 శాంపిల్స్ నెగిటివ్ గా వచ్చాయి మరియు 1259 టెస్టులు పాజిటివ్ గా వచ్చాయి. ఇప్పటివరకు 10 లక్షల పాపులేషన్ కి అత్యధికంగా టెస్ట్ చేస్తున్నా ఘనత ఆంధ్రప్రదేశ్ కి ఉంది. ప్రతి పది లక్షల మందికి 1504 టెస్టులు చేస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది.  ఈ సంఖ్య  మన పొరుగు రాష్ట్రమైన తమిళ్ నాడు కంటే ఎక్కువ. రాజస్థాన్ 83092 టెస్టులను   చేసి పర్ మిలియన్ కి 1072 టెస్టుల్లో చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు 83334 టెస్టులు చేసి 1259 టెస్టులు పాజిటివ్ అని తేల్చింది. 716733  టెస్టులు దేశవ్యాప్తంగా చేయగా 29572 కేసులు పాజిటివ్ గా నిర్ధారించబడినయి ఈ రేటు 4.13 ఆల్ ఇండియా పాజిటివ్ రేటు గా ఉంది. మహారాష్ట్ర ఇప్పటివరకూ 115147  ఈ కేసులో టెస్ట్ చేయగా  8590 కేసులు పాజిటివ్ గా  తేలాయి.

IHG

 

పాజిటివ్ రేటు 7.46, మధ్యప్రదేశ్ లో 25665 కేసులను టెస్ట్ చేయగా 2165 పాజిటివ్ కేసులు వచ్చాయ మరియుి ఈ రాష్ట్రంలో 8.44  పాజిటివ్ రేటు గా ఉంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో నమోదైన కేసులలో మరియు నమోదవుతున్న కేసులలో 80 నుంచి 90 శాతం కేసులు ఇప్పటికే ఉన్న  క్లస్టర్లలో నే నమోదవుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.  సందర్భంగా ఆయన ప్రతి జిల్లాలోనూ క్వారంటైన్ వార్డ్ లను 300  బెడ్ లతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎవరికైతే ఇకపై కోవిడ్ లక్షణాలు  మైల్డ్ గా ఉంటాయో వారందరూ కూడా జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రంలో ఉంటూ చికిత్స టిస్టుకోవచ్చు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వివరించారు. కరోనా పాజిటివ్ కేసులు డబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నందున ఆ యొక్క సంఖ్య ఏ రోజుకి డబుల్ అవుతుందో  (డబులింగ్  సంఖ్య)  మీడియా ముఖంగా తెలియజేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ డబుల్ సంఖ్య 8.9 రోజుల్లో డబుల్ అవుతుందని  తెలియజేశారు.

IHG

 

 

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా టెలీ మెడిసిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సర్వీస్కు  నెంబర్ 14410 నీ కేటాయించడం  జరిగింది.  ఈ సర్వీస్ ద్వారా ఇప్పటివరకూ 8865 సేవలు అందించడం జరిగింది. రాష్ట్రంలో మరో మూడు ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు వైద్య శాఖ కార్యదర్శి తెలియజేశారు. ఆ మూడు  ల్యాబ్ లను నెల్లూరు,  శ్రీకాకుళం, ప్రకాశం  లలో ఏర్పాటు చేస్తున్నట్లు  జవహర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ ఆఫీసర్ కి, స్టాఫ్ నర్స్ కి మరియు ఇద్దరు అటెండర్ కి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు అదేవిధంగా ఇప్పటి వరకు ఫ్రంట్ లైన్  ఆఫీసర్స్ లో 12 మంది స్టాఫ్ నర్స్ కి, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ 30 మంది, డాక్టర్స్ 12 మంది , ఫార్మసిస్ట్ ఇద్దరికీ , శానిటేషన్ స్టాఫ్ ఇద్దరికీ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: