సాధారణంగా సముద్ర గర్భంలో ఎన్నో అద్భుతమైన జీవరాశి ఉంటుంది.  వింత వింత చేపలు.. ఇతర ప్రాణి కోటి ఉంటుంది. వీటిని మనం నేరుగా చూడలేం... జియోగ్రాఫిక్ చానల్స్ ఇతర యూట్యూబ్స్ లో చూడగలం. ఇప్పటికే అనేక జీవజాతులు మహాసముద్రాల్లో అట్టడుగున జీవిస్తూ సైన్స్ కు అందని రీతిలో విస్మయం కలిగిస్తున్నాయి. తాజాగా  రష్యాకు చెందిన ఓ సముద్ర జీవశాస్త్రవేత్త (మెరైన్ బయాలజిస్ట్) సముద్ర గర్భంలో ఓ జీవిని ఫొటో తీశారు. ఈ జీవి ఓ వింతైన  ఆకారంతో ఆశ్చర్యం కలిగించేలా ఉంది. దీన్ని ఫొటో తీసిన పరిశోధకుడి పేరు అలెగ్జాండర్ సెమెనోవ్. వెన్నెముక లేని జీవజాలంపై స్పెషలైజేషన్ చేశాడు.

తాజాగా, రష్యాలోని తెల్ల సముద్రంలో మంచు ఫలకాల అడుగుభాగాన ఓ అద్భుతమైన జీవిని సెమెనోవ్ క్లిక్ మనిపించాడు.   అలెగ్జాండర్ సెమెనోవ్ సముద్రాల్లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం పరిశోధనలు సాగించే సెమెనోవ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా. సముద్ర దేవతగా అభివర్ణించే ఈ జీవిని అత్యున్నత నాణ్యతతో ఫొటో తీశాడు. ఆ ఫొటోలను తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు. 

ఆయన తీస్తున్న ఫోటో పిక్స్ ఎంతో అందమైనవే అయినా, అంతుచిక్కని జీవులని పేర్కొన్నాడు. అలెగ్జాండర్ మాస్కో స్టేట్ యూనివర్సిటీకి చెందిన వైట్ సీ బయోలాజికల్ స్టేషన్ డైవర్ల బృందానికి నాయకుడు. న్యూరో బయాలజీలో ఎక్కువగా అధ్యయనం చేసే వీటిని టెరోపోడ్ మోలుస్క్ అని పిలుస్తారని తెలిపాడు. అయితే వాటి జీవితచక్రం గురించి తెలిసింది చాలా తక్కువ అని సెమెనోవ్ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: