క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో భార‌త్ అనేక దేశాల‌ను ఆదుకుంటోంది. వైర‌స్ నుంచి త‌న‌ను తాను కాపాడుకుంటూనే మిగ‌తా దేశాలకు అవ‌స‌ర‌మైన మందుల‌కు, ఆహార‌ధాన్యాల‌ను అందిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు స‌మారు 85దేశాల‌కుపైగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌, పారాసెట‌మాల్ త‌దిత‌రు మందుల‌ను అందించింది భార‌త్‌. ఇందులో అగ్రరాజ్యం అమెరికా, బ్రిట‌న్‌తోపాటు ప‌లు ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయి. ఇదే విష‌యాన్ని ఈ రోజు జ‌రిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల స‌మావేశంలో మంత్రి జైశంక‌ర్ వెల్ల‌డించారు.

 

భారతదేశం దాదాపు 85 దేశాలకు ఫార్మా సహాయం అందిస్తోంద‌ని తెలిపారు. ఆఫ్రికాలోని అనేక దేశాలతో సహా దాదాపు 85 దేశాలకు భారతదేశం ఫార్మా సహాయం అందిస్తోందని ఆయ‌న పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సాంప్రదాయ ఔష‌ధ‌ వ్యవస్థల సామర్థ్యాన్ని గుర్తించాలని ఆయ‌న సూచించారు. ఈ ప్ర‌య‌త్నాల‌కు అంద‌రూ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. కాగా, భార‌త్ అందిస్తున్న సాయానికి ప్ర‌పంచ వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆప‌ద‌లో ఆదుకుంటున్న భార‌త్‌కు అనేక దేశాల ప్ర‌జ‌లు జేజేలు ప‌లుకుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: