త‌మిళ‌నాడును క‌రోనా  వైర‌స్ గ‌జ‌గ‌జ వణికిస్తోంది. రోజురోజుకూ రాష్ట్ర‌వ్యాప్తంగా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి.  అయితే ఈ వైరస్ మ ‌హ‌హ్మారి పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పిల్లల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కేసుల సంఖ్య తక్కువని కొందరు వైద్యులు గతంలో చెప్పారు. కాని దానికి విరుద్ధంగా తమిళనాడు రాష్ట్రంలో 12 ఏళ్ల వయసు లోపు 121 మంది పిల్లలకు కొవిడ్-19 సోకిందని తాజాగా తేలింది. 

 

రాష్ట్రంలో 2,058 కరోనా కేసులు వెలుగుచూడగా, ఇందులో 121 మంది పిల్లలే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 1392 మంది పురుషులు, 666 మంది మహిళలు కరోనా బారిన పడ్డారు. చెన్నై నగరంలో గత 24 గంటల్లోనే 103 కరోనా కేసులు వెలుగుచూశాయ. చెన్నై నగరంలో అత్యధికంగా 673 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. తమిళనాడులో 1128 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. తమిళనాడులో కరోనా మృతుల సంఖ్య 25కు పెరిగింది. పిల్లలకు కరోనా సోకడంతో వారి తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: