భార‌త్‌లో రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి మ‌రింత‌గా రెచ్చిపోతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. వ‌ర‌ల్డ్ మీట‌ర్ డేటా ప్ర‌కారం.. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివర‌కు పాజిటివ్ కేసుల సంఖ్య 31,324కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,008 మంది మ‌ర‌ణించారు. భారతదేశంలో అత్యధిక కేసులు మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఢిల్లీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్తాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌మిళ‌నాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లోనే న‌మోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో 8,590, గుజరాత్ లో 3,548, ఢిల్లీలో 3,108, మధ్యప్రదేశ్ లో 2,368, రాజస్థాన్ లో 2,262, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 2,043, తమిళనాడులో 1,937 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

 

అయితే.. దేశ‌వ్యాప్తంగా కేవలం 15 జిల్లాల్లో మాత్ర‌మే క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. సుమారు 300కిపైగా జిల్లాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం లేద‌ని చెబుతున్నాయి. మ‌రికొద్ది రోజుల్లోనే మిగ‌తా జిల్లాలు కూడా క‌రోనా ర‌హితంగా మారుతాయ‌ని కేంద్ర‌వ‌ర్గాలు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇక మే 3వ తేదీన లాక్‌డౌన్ ముగుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ నిర్ణ‌యం ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: