దేశంలో గత నెల నుంచి లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్థంభించిపోయాయి.  దాంతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయి.. సాధారంగాణ అడవుల్లో ఉండే జంతువులు రోడ్లపైకి రావడం మొదలయ్యాయి.  ఎప్పుడూ జనాలు తిరుగుతూ.. హడావుడిగా ఉండటంలో ఏలాంటి పక్షులు.. జంతువులు బయటకు వచ్చేవి కావు.. కానీ లాకౌ డౌన్ విధించినప్పటి నుంచి వివిధ రకాల జంతువులు, పక్షలు రోడ్లమీదకు రావడం చూస్తున్నాయి. ఇదిలా ఉంటే అప్పుడప్పుడు కృరమృగాలు కూడా రోడ్లమీదకు వస్తున్నాయని అంటున్నారు. ఆ మద్య మంచిర్యాల జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయబ్రాంతుకు గురిచేస్తుంది.

 

ఇప్పటికే కరోనా కారణంగా జనాలు ఇళ్లకే పరిమితం కావడంతో జంతువులు గ్రామలలోకి వస్తున్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా తాండురు మండలం గోపాలరావుపేట గ్రామ శివార్లలో పులి సంచరిస్తుడడం అక్కడి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో పంట పొలాలకు వెళ్లడానికి జనం భయపడుతున్నారు. తాాజాగా ఇప్పుడు అనంతపురం జిల్లాలోని బెళుగుప్ప మండలం ఎర్రగుడిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.

 

గ్రామంలోకి వచ్చిన చిరుతను గ్రామస్తులు గుర్తించి వెంటనే గ్రామ శివార్లలోకి తరిమికొట్టారు. గుంపులుగా తరిమి కొట్టారు కానీ.. ఒంటరిగా అటు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. వెంటనే అటవీ శాఖ వారు ఆ చిరుతను బందించాల్సిందిగా కోరుతున్నారు. గ్రామంలో చిరుత సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.  ఏది ఏమైనా ఇప్పుడు లాకౌ డౌన్ ఇబ్బంది వల్ల చాలా జంతువులు ఆకలితో అలమటించి పోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: