రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ బుల్లితెర న‌టి దుర్మ‌ర‌ణం పాలైన సంఘ‌ట‌న అమెరికాలో జ‌రిగింది. అట్లాంటాకు చెందిన బుల్లితెర నటి, రియాలిటీ టెలివిజన్‌ స్టార్‌ ఆప్లే రాస్ (34) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అమెరికాలో రాస్ ప్ర‌ముఖ బుల్లితెర న‌టిగా పాపుల‌ర్ అయ్యారు. గత ఆదివారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రగాయాలవ్వ‌గా ఆమెను హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన 24 గంట‌ల త‌ర్వాత సోమ‌వారం ఉద‌యం ఆమె మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు ధృవీక‌రించారు.

 

ఆష్లే రాస్ లిటిల్ ఉమెన్, అట్లాంటా రియాలిటీ షోలో ‘మిన్నీ’గా అందరికి సుపరిచితం. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా సూప‌ర్ పాపులార్టీ షోగా ఉన్న ఈ రియాల్టీ షో ఇప్ప‌టి వ‌ర‌కు 5 సీరిస్‌ల‌ను కంప్లీట్ చేసుకుంది. మహిళల జీవిత సమస్యలను డ్రామా రూపంలో చూపిస్తున్న ఈ రియాలిటీ షో.. అట్లాంటాలో మంచి ఆదరణ పొందుతుంది. ఇక మిన్నీ పాత్రలో ఆష్లే రాస్‌ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఆరో సీరిస్ షూటింగ్ జ‌రుపుతోన్న టైంలో ఈ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పలువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: