బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.  ఎన్నో వొడిదుడుకులు ఎదురైనా.. కష్టాలు కన్నీళ్లు దాటుకొని మంచి నటుడిగా స్థిరపడుతున్న సమయంలో విధి వంచితుడై ప్రాణాలతో పోరాటం చేశాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్.  ప్రాణాలు హరించే క్యాన్సర్ ని జయించి ఆరోగ్యంగా ఇంటికి వచ్చినా.. మరో విషాదం. కంటికి రెప్పలా చూసుకున్న ఆయన తల్లిగారు కన్నుమూశారు.  ఈ విషాదం నుంచి కోలుకునే లోగా ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూయడంతో బాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది.  అయితే ఇర్ఫాన్ ఖాన్ కేవలం బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాడు.  

 

ఇక  2006లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన సైనికుడు మూవీలో ఇర్ఫాన్ ఖాన్ నటించారు.   మహేష్ బాబు, త్రిష, ఇర్ఫాన్ ఖాన్ ఇందులో ప్రధాన పాత్రధారులు. అంతకు ముందే మహేశ్ బాబు హీరోగా సంచలనాత్మకమైన విజయం సాధించిన పోకిరి చిత్రం వెంటనే ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యింది కాని బాక్సాఫీసు వద్ద పూర్తిగా విఫలమయ్యంది.    

 

తుఫాను బాధితులకు ఏడు కోట్లు విరాళంగా ఇస్తున్నానని ఆ ఏరియాలో పెద్ద దాదా అయిన పప్పూయాదవ్ (ఇర్ఫాన్ ఖాన్) గా నటించాడు.  హీరోయిన్ త్రిషను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని తెగ తాపత్రయ పడతాడు.  ఈ నేపథ్యంలో సాగే సినిమా వినోదాత్మకంగా ఉంటుంది.  ఇందులో మహేష్ బాబు తో పాటు తెలుగు నటులతో మంచి అనుబంధం పెంచుకున్నారు ఇర్ఫాన్ ఖాన్.  తాజాగా ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూయడం తెలుగు ఇండస్ట్రీ ప్రగాఢసంతాపాన్ని తెలియజేస్తుంది. తాజాగా బోనికపూర్ ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. సహజ నటుడు మంచి మిత్రుడు దూరమయ్యాడని ఆవేదన వ్యక్తి చేశాడు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: