గత కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఇర్ఫాన్ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూబాయ్‌ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. భారతీయ భాషలతో పాటు హాలీవుడ్ లోను ఇర్ఫాన్ ఖాన్ విజయాలు అందుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్ స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. 
 
నటనలోని సహజత్వం, వైవిధ్యభరితమైన పాత్రల ఆధారంగా దేశంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరిగా మనకు గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొంతకాలం నుంచి ఆయన క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఇర్ఫాన్ కుటుంబంలో ఇది రెండో విషాదం కావడం గమనార్హం. ఇర్ఫాన్ ఖాన్ తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. 
 
ఇర్ఫాన్ మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇర్ఫాన్ మృతి పట్ల బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: