ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్(53) కొద్ది సేప‌టి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయ‌న న‌టనా రంగంలో ఓ విల‌క్ష‌ణ‌మైన వ్య‌క్తి. ఆయ‌న మొద‌టి సినిమా స‌లామ్ బాంబే. పాన్ సింగ్ తోమర్ సినిమాకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. ఇర్ఫాన్ కేవ‌లం బాలీవుడ్‌కే కాకుండా టాలీవుడ్‌, హాలీవుడ్‌కు కూడా సుప‌రిచితులే. తెలుగులో మ‌హేష్‌బాబు హీరోగా వ‌చ్చిన సైనికుడు సినిమాలో న‌టించాడు. తన నటనతో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కాలు అందుకున్నారు. ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్‌, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇర్ఫాన్‌ బాలీవుడ్‌ సినిమాలే కాకుండా స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. 

 

వెండితెర‌పై వైవిధ్య న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న ఆయ‌న చివ‌రి జీవితం ఎంతో ఆవేద‌న‌తో.. ప్ర‌తి ఒక్క‌రి క‌ళ్ల‌లో క‌న్నీటి సుడులు మిగిల్చింది. 2018 లో న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడ్డ ఆయ‌న  లండ‌న్‌లో చికిత్స పొందారు. ఇర్ఫాన్ త‌ల్లి  ‌సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. త‌ల్లి చ‌నిపోయి కొద్ది రోజులు కూడా కాక‌ముందే ఇర్ఫాన్ ఇలా ఆక‌స్మాత్తుగా క‌న్నుమూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: