బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. పెద్దపేగు ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మంగళవారం అయన ముంబాయిలోని కోకిలాబెన్ ఆసుపత్రి లో చేరారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండ‌గా ఆయ‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో మృతి చెందారు.

 

ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్, టాలీవుడ్‌ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2018 మేలో ఇర్ఫాన్‌ ఖాన్ క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ మృతికి సంతాపం వ్య‌క్తం చేసిన వారిలో వైజ‌యంతీ మూవీస్‌, క‌మ‌ల‌హాస‌న్‌, నేచుర‌ల్ స్టార్ నాని, ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర‌, యువ హీరో కార్తీకేయ, సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌, బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా త‌దిత‌రులు ఉన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: