ఇర్ఫాన్‌ఖాన్‌.. పోరాడాడు..! పోరాడాడు..! తుదిశ్వాస దాకా పోరాడాడు..! ఆ క్యాన్స‌ర్‌ మ‌హ‌మ్మారిని ఓడించ‌లేక‌పోయాడు..! మ‌నంద‌రినీ దుఃఖ‌సాగ‌రంలోకి నెట్టి అత‌డు వెళ్లిపోయాడు. మ‌న మ‌ధ్య నుంచి దూరంగా వెళ్లిపోయాడు.. ఎన్నో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో అల‌రించిన ఇర్ఫాన్ ఖాన్ ఇక లేర‌ని తెలియ‌గానే సినీక‌ళామ‌త‌ల్లి ఎక్కిఎక్కి‌ ఏడ్చింది..!  అరుదైన న‌టుడిని కోల్పోయామంటూ సినీప్ర‌ముఖులు బ‌రువెక్కిన గుండెల‌తో కంట‌త‌డిపెట్టారు..! తమ అభిమాన హీరో ఇక లేరంటూ అభిమానులు క‌న్నీళ్లుపెట్టుకున్నారు. నిజానికి.. క్యాన్స‌ర్‌తో ఇర్ఫాన్ చాలాకాలంగా పోరాడారు. న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్లు 2018 లో ఇర్ఫాన్‌ఖాన్ స్వ‌యంగా ప్రకటించారు కూడా. విదేశాల‌లోనూ చికిత్స పొందారు. అయినా ఆయ‌న ఆరోగ్యం కుదుట‌ప‌డ‌లేదు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న తుదిశ్వాస విడిచారు.

 

1967 జ‌న్మించిన ఇర్ఫాన్‌ఖాన్‌ 54ఏళ్ల వ‌య‌స్సులోనే ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో అద్భుత‌మైన విజ‌యాల‌ను అందుకున్నారు. మ‌రెంతో కాలం తెర‌పై అల‌రించాల్సిన అరుదైన న‌టుడిని క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి బ‌లితీసుకోవ‌డంతో చిత్ర‌లోకం శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఇర్ఫాన్ ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో న‌టించారు.  అతని అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో అతని తొలి చిత్రం అకాడమీ అవార్డు సలాం బాంబే !, మక్బూల్ (2004), పాన్ సింగ్ తోమర్ (2011), ది లంచ్బాక్స్ (2013), హైదర్ (2014), గుండే (2014), పికు (2015 ) మరియు తల్వార్ (2015) హిందీ మీడియం (2017) త‌దిత‌ర చిత్రాల‌తో ఆయ‌న మంచి గుర్తింపు పొందారు. ఇర్ఫాన్ స్లమ్‌డాగ్ మిలియనీర్, జురాసిక్ వరల్డ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లైఫ్ ఆఫ్ పై వంటి అనేక అంతర్జాతీయ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కూడా న‌టించాడు. ఆయ‌న అభిమానులు ఆ చిత్రాల‌ను గుర్తుచేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: