పాకిస్తాన్‌లో కరోనావైరస్ క‌ల‌క‌లం రేపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య‌ 14,885కు చేరుకుంది. మహమ్మారి బారిన‌ప‌డిన మరణించిన వారి సంఖ్య 327కు చేరుకుందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్ప‌టివ‌ర‌కు 3,425 మంది వైర‌స్ నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని, 129 మంది పరిస్థితి విషమంగా ఉంది. పంజాబ్‌లో 5,827, సింధ్ 5,291, ఖైబర్-పఖ్తుంఖ్వా 2,160, బలూచిస్తాన్ 915, గిల్గిట్-బాల్టిస్తాన్ 330, ఇస్లామాబాద్ 297, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో 65 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

కాగా, ఇటీవ‌ల పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా సెల్ఫ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. అయితే.. లాక్‌డౌన్ కాలంలో ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను తీర్చ‌డంలో పాక్ ప్ర‌భుత్వం విఫ‌లం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా రేష‌న్ బియ్యం, త‌దిత‌ర నిత్యావ‌స‌రాలు కూడా అందించ‌డంలేద‌నే టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: