దేశంలో కరోనా మహమ్మారి ఏ రకంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఒకటి ఇప్పటికే 1005 మంది ప్రాణాలు పోయాయి.. వెల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.  ఇక లాక్ డౌన్ సందర్భంగా అన్ని ప్రయాణ సౌకర్యాలు షట్ డౌన్ అయ్యాయి.  దీని వల్ల ఆర్థిక నష్టం వస్తున్నా.. ప్రాణాలు ముఖ్యమని భావిస్తున్నారు.  అందుకే లాక్ డౌన్ వచ్చే నెల 3 వరకు పెంచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆర్థిక మాంద్యం తట్టుకోలేక జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.  చాలా మంది ఎంప్లాయిస్ కూడా ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు.

 

తాజాగా స్పైస్‌జెట్ పైలెట్లకు ఆ సంస్థ షాకిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్, మే మాసాల్లో జీతాలు చెల్లించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరోవైపు కార్గో పైలెట్లకు కాస్త ఉపశమనం.. గంటల చొప్పున జీతాన్ని చెల్లిస్తామని స్పష్టం చేసింది.  ఈరోజు వరకూ 16 శాతం విమానాలు, 20 శాతం మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు.

 

ఇప్పటి వరకూ 5 కార్గో విమానాలు పనిచేస్తున్నాయి.  ప్రస్తుతం ఇబ్బందుల దృష్ట్యా  ఏప్రిల్, మే మాసాల జీతాలు చెల్లించబడవు. అయితే కార్గో విమానాలు నడుపుతున్న పైలెట్లకు మాత్రం ‘బ్లాక్ హవర్స్’ చొప్పున చెల్లిస్తాం’’ అని ఆ సంస్థ ఆపరేషన్ చీఫ్ గురుచరణ్ అరోరా ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: