వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబు కుటుంబానికి చెందిన ఉప్పల్ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీలో కొందరి కరోనా నిర్ధారణ అయినట్లు ప్రచారం జరుగుతోందని అన్నారు. ఫ్యాక్టరీలోని మరికొందరిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు వార్తలు వస్తున్నాయని చెప్పారు. టీవీ ఛానెల్స్ లో హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీలో పని చేసే వారికి కరోనా సోకినట్లు విసృతంగా ప్రచారం జరుగుతోందని అన్నారు. 
 
 
లక్షల మందికి పాలు సరఫరా చేసే హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీలో కరోనా సోకితే వైరస్ విసృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. చంద్రబాబు తక్షణమే స్పందించి నిజానిజాలు చెప్పాలని... రాజకీయనాయకుడుగా చంద్రబాబు వాస్తవాలు, అవాస్తవాలు చెప్పాల్సి ఉందని అన్నారు. చంద్రబాబు కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారని ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. 
 
చంద్రబాబు హెరిటేజ్ ఫ్యాక్టరీని క్లోజ్ చేశారా...? లేదా...? చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పాల ఉత్పత్తుల వల్ల ప్రమాదం ఉందో లేదో వివరణ ఇవ్వాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: