దేశంలో రాను రాను కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని తీవ్రంగా చూపిస్తుంది.  దేశంలో ఇప్పటికే వెయ్యి మంది మృతి చెందారు.  ఇక కరోనా ని కవరింగ్ చేస్తున్న జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని.. ఇటీవల ముంబాయిలో కరోనా జర్నలిస్టులకు కరోనా సోకిందని  తమిళనాడు లో అదు పరిస్థితి అని వాపోయతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ రోజు ఓ సానుకూల వార్త చెప్పారు.

 

ఢిల్లీలో 529 మంది మీడియా ప్రతినిధులకు పరీక్షలు చేయగా.. కేవలం ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌ అని తేలిందని చెప్పారు. అంతే కాదు కరోనా సోకిన జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేజ్రీవాల్ చెప్పారు.ముంబై, చెన్నైలో చాలా మంది జర్నలిస్టులకు కరోనా సోకినట్టు తేలవడంతో ఢిల్లీ ప్రభుత్వం గతవారం మీడియా ప్రతినిధులకు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది.  కరోనాపై తమ ప్రాణాలకు తెగించిన కవరింగ్ చేస్తున్న మీడియాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని అంటున్నారు పలువురు మీడియా సభ్యులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: