ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ( 53) ఈ రోజు ముంబైలోని కోకిలాబెన్ హాస్ప‌ట‌ల్లో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌రోనా ఉన్నందున కేవ‌లం ఐదుగురు స‌మ‌క్షంలోనే ఇర్ఫాన్ అంత్య‌క్రియ‌లు కూడా అత్యంత నిరాడంబ‌రంగా పూర్త‌య్యాయి. ఇక ఇర్ఫాన్ ఖాన్ మరణంపై ఆయన  చిన్ననాటి స్నేహితుడు భరత్ పూర్ (రాజస్థాన్) ఎస్పీ హైదర్ అలీ జైదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. చిన్న‌ప్ప‌టి నుంచి వీరిద్ద‌రు మంచి ఆప్త‌మిత్రులు. 

 

ఇక ఇర్ఫాన్ లేడ‌న్న విష‌యం తాను జీర్ణించుకోలేక పోతున్నాన‌ని.. ఇప్ప‌ట‌కి అయినా అతడినుంచి ఫోన్ వస్తుందని ఇప్పటికీ ఎదురు చూస్తున్నానంటూ కంటతడి పెట్టారు. ఇంతటి విషాదాన్ని తట్టుకునే ధైర్యం ఆ కుటుంబానికి కలగాలని ప్రార్థించారు. ఆ కుటుంబంతో ఎంతో స్నేహంగా ఉండే ఎస్పీ ఆలీ ఓ విష‌యం కూడా గుర్తు చేసుకున్నాడు. ఇర్ఫాన్  ఉపాధ్యాయుడు కావాలని  ఆమె తల్లి కోరుకున్నారని  జైదీ గుర్తు చేసుకున్నారు. ఇక ఇర్ఫాన్ మృతికి ఆలీ నివాళులు అర్పిస్తోన్న వీడియో సైతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: