కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యుద్ధవిమానాలు నడపటం కంటే పార్టీని నడపటం కష్టమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పీసీసీ బాధ్యతలు తీసుకున్నానని అన్నారు. తెలంగాణలో మాత్రమే కాక దేశమంతటా కాంగ్రెస్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉందని చెప్పారు. భారత సైనికుల్లో క్రమశిక్షణ ఉన్నా రాజకీయాల్లో క్రమశిక్షణ ఉండదని చెప్పారు. తెలంగాణలో కరోనా కేసులపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. 
 
తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించి తక్కువ కేసులు ఉన్నాయని చెప్పడం సరికాదని అన్నారు. కరోనా గురించి కేసీఆర్ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారని... ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ బియ్యం 80 శాతం మంది ప్రజలు తినడం లేదని చెప్పారు. ప్రభుత్వం పంపిణీ చేసిన 1500 రూపాయల నగదు ఇప్పటికీ చాలామందికి చేరలేదని అన్నారు. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం అని చెప్పారు. 
 
గవర్నర్ ను కలవాలని తాము అనుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రెస్ మీట్లకే పరిమితమైందని రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: