IHG

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఈ రోజు చనిపోవడం యావత్ భారత దేశాన్ని దుఃఖ సాగరం లోకి నెట్టేసింది. ఈరోజు ఇర్ఫాన్ ఖాన్ ముంబై లోని కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో చనిపోయాడు. కొద్దిరోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఇర్ఫాన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అందుకుంటూ తన తుదిశ్వాస విడిచాడు. అయితే భారత సినీ ప్రముఖులు అయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రొద్దున  చిరంజీవి వరల్డ్ డాన్స్ డే సందర్భంగా తాను ఓ వీడియో తో అభిమానులను ఉత్సహపరుస్తానని తెలియజేశాడు. అయితే కొద్దిసేపటికే ఇర్ఫాన్ ఖాన్ చనిపోయాడన్న వార్త తెలియడంతో. చిరంజీవి కూడా అయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేసాడు.

IHG

 

చిరు ట్వీట్ చేస్తూ.. ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూసిన భయంకరమైన వార్త వినడానికి బాధగా ఉంది. ప్రపంచ గుర్తింపు పొందిన అద్భుతమైన నటుడు. అతన్ని ఎప్పటికీ భర్తీ చేయలేము. అతని తీవ్రత మరియు మనోహరమైన ప్రవర్తన మన హృదయాల్లో ముద్రించబడి ఉంటుంది. ప్రియమైన ఇర్ఫాన్, మేము మిమ్మల్ని కోల్పోయాము మరియు మీరు ఎప్పటికీ మా మనసులో పదిలంగా ఉంటారు ' అని స్పందించారు.అయితే ఈ సందర్భంగా మరియు ఆయనపై మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ తన డాన్స్ వీడియోను పోస్ట్ పెట్టడం లేదని పేర్కొన్నాడు. అయితే ఆ డాన్స్ వీడియో మాత్రం మారె సందర్భంలో నైనా పోస్ట్ చేసే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు ....

మరింత సమాచారం తెలుసుకోండి: