ఏపిలో కరోనా పంజా విసురుతుంది.. ఇప్పటికే వెయ్యి కేసులు దాటాయి. మరణాల సంఖ్య 31 మంది మరణించారు.  తాజాగా రాజధాని రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను నిలిపివేయాలని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న వారిపై కేసుల పేరిట వేధింపులు తగవని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని, పాత కేసుల పేరుతో రైతులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం తగదని అన్నారు. గత 130 రోజులుగా ఆందోళనలు చేస్తున్నవారిపై కేసులు పెట్టడం సరికాదని, సీఆర్డీఏ మాస్టర్‌ ఫ్లాన్‌లో ఆర్‌-5 జోన్‌ నిబంధనలు చేర్చడం సమంజసమా? అని ప్రశ్నించారు. 

 

తమ రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగాలని... మంచి మనసు చేసుకొని  రాజధాని భూములు ఇచ్చిన వారి పట్ల ప్రభుత్వం సానుభూతితో ఆలోచించాలని కోరారు.  ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుందని.. ఈ సమయంలో రైతన్నలను కష్టాలు రాకుండా  ప్రభుత్వం చూడాలని.. వారిని ఇబ్బంది పెట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.  కష్టాల్లో ఉన్న వారిపై కేసుల పేరిట వేధింపులు తగవని అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కౌలు మొత్తాన్ని పెంచి వెంటనే చెల్లించాలని, భూమి లేని పేదలకు ప్రతి నెల ఇచ్చే పెన్షన్లు విడుదల చేయాలన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: