అన‌సూయ‌.. హాట్ యాంకర్‌గా మాంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్. బుల్లితెర‌పై క‌నిపించినా.. వెండితెర‌పై మెరిసినా.. క‌న్నార్ప‌కుండా చూసే అభిమానులు కోకోల్ల‌లు.. జబర్దస్త్ వంటి కామెడీ షోకు అన‌సూయ అద‌న‌పు అంద‌మ‌నే చెప్పాలి.. కాదుకాదు అమెనే అంద‌మ‌ని చెప్పాలి.. ఆమె కోసం చూసే వారి సంఖ్య‌నే ఎక్కువ‌గా ఉంటుంద‌ని కొంద‌రు అంటుంటారు. గ్లామరస్‌గా క‌నిపించ‌డంలో హీరోయిన్లు అయినా కొంచెం వెన‌కాముందు ఆలోచిస్తారేమోగానీ.. అన‌సూయ మాత్రం వెన‌క్కిత‌గ్గ‌దు.. త‌గ్గే స‌మస్యే‌లేదని అంటుంది. అంతేగాకుండా.. ఆమె మాట‌లు కూడా అంతే బోల్డ్ గా ఉంటాయి. ఇంత‌కీ అన‌సూయ తాజా ముచ్చ‌టేమిటంటే.. బికినీ గురించి ఆమె ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం చెప్పింది.

 

బికినీ వేస్తారా..? అంటే ట‌క్కున స‌మాధానం చెప్పింది. తనకు బికినీ వేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని... అయితే అది వేసుకోవడానికి తగిన బాడీ ఉండాల‌ని... లేదంటే ఎబ్బెట్టుగా ఉంటుందని చెప్పింది. ఒక‌వేళ‌ తనకు కనుక బికినీ వేసుకోవడానికి ఫిట్ అయిన బాడీ ఉంటే తప్పకుండా వేసుకుంటానని, అందులో ఎటువంటి అనుమానం అవ‌స‌రం లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టింది. అయితే.. చివ‌రికి త‌న‌దైన శైలిలో ట్విస్ట్ ఇచ్చింది.. ప్రస్తుతం బికినీకి సరిపడా బాడీ త‌న‌కు లేద‌ని అభిమానుల ఆశ‌ల్లో నీళ్లు చ‌ల్లింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: