ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా పెరూలోని జైలులో ఉన్న 600 మంది ఖైదీలకు కరోనా సోకడంతో తమను విడుదల చేయాలని మిగతా ఖైదీలు ఆందోళనకు దిగారు. ఖైదీలు రెచ్చిపోయి భీభత్సం సృష్టించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. 
 
పెరూలోని మైగుల్ క్యాస్ట్రో-క్యాస్ట్రో జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జైలు అధికారులు, సిబ్బంది గాయపడ్డారు. చాలామంది ఖైదీలు జైలు గోడలు ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపు చేసే ప్రయత్నల్లో భాగంగా కాల్పులు జరిపారు. 60 మంది పోలీస్ సిబ్బంది, ఐదుగురు పోలీసులు, ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు. మన దేశంలో కూడా కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో 31,000 మంది కరోనా భారీన పడగా 1000 మందికి పైగా మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: