తెలంగాణ‌ గాంధీ వైద్యుల కృషితో ప‌సికందు క‌రోనాను జ‌యించి దేశంలో రికార్డు సృష్టించాడు. పుట్టిన 23 రోజులకే కరోనా సోకగా, ఆ మహమ్మారితో 21 రోజులపాటు పోరాడి విజయం సాధించాడు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. వైరస్‌ సోకి కోలుకున్నవారిలో దేశంలోనే అతిపిన్న వయస్కుడిగా వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి రావడంతో అతడికి వైరస్ సోకింది. ఈ క్రమంలో అతని 23 రోజుల కుమారుడికి విరేచనాలు కావడంతో నిలోఫర్‌కు తీసుకెళ్లారు. శిశువులో వైరస్‌ లక్షణాలు కనిపించకపోయినప్పటికీ తండ్రికి పాజిటివ్‌ ఉండటంతో తల్లీబిడ్డకు వైద్యులు క‌రోనా వైర‌స్‌ నిర్ధారణ పరీక్షలుచేశారు.

 

తల్లికి నెగెటివ్‌రాగా, పసివాడికి పాజిటివ్‌గా తేలటంతో అప్ర‌మ‌త్తం అయిన అధికారులు ఈ నెల 10న గాంధీకి తరలించారు.ఆ ప‌సికందుకు కాపాడేందుకు 19 రోజులపాటు  వైద్యులు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డారు. మెరుగైన చికిత్స అందించ‌డంతో కోలుకున్నాడు. ఇక త‌న‌బిడ్డ‌ను త‌ల్లి తన గుండెలక‌‌త్తుకుంది. వైద్యుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపి కొడుకుని తీసుకుని ఆనందంగా ఇంటికి వెళ్లిపోయింది. ఈ శిశువుతోపాటు 12 ఏండ్లలోపు చిన్నారులు మరో 13 మందిని డిశ్చార్జి చేసినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. గాంధీలో ఇప్పటివరకు సుమారు 95 మంది చిన్నారులు పాజిటివ్‌తో చేరగా, కోలుకొన్నవారిని  డిశ్చార్జి చేస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: