అదేమిటీ.. హీరోయిన్లు బికినీ ధరిస్తారు కదా..! బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ బికినీ ధరించడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? ఇందులో చిన్న కిటుకు ఉందండీ.. కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితం అయిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరమైన పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇంటిపనులు చేస్తూ.. డ్యాన్స్‌లు చేస్తూ.. రకరకాల ఫీట్లు చేస్తూ.. అబ్బో.. అభిమానులను అలరించడానికి.. ఆకట్టుకోవడానికి బాగానే కష్టపడుతున్నారు.
ఇక బిగ్‌బీ మాత్రం ఎవరికి తక్కువ..! ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన కూడా ఒక ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. కేవలం బనియన్, అండర్‌వేర్‌తో ఉన్న ఆ ఫొటో.. 1983లో ఆయన నటించిన మహాన్ చిత్రంలోనిదట. దీనిపై అమితాబ్ ఫన్నీ కామెంట్ కూడా చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్‌లు, ఫాలోవర్లను పెంచుకోవాలంటే బికినీ ఫొటోలు పోస్ట్ చేయాలని ఒకతను తనకు సలహా ఇచ్చారని, అందుకే ఈ బికినీ ఫొటో పోస్ట్ చేసినట్లు సరదాగా కామెంట్ చేశారు బిగ్‌బీ అమితాబ్..!