బాలీవుడ్‌కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే సీనియర్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంతో అంతా శోఖ సంద్రంలో ఉండగానే మరో చేదు వార్త వినాల్సి వచ్చింది.    1970 చిత్రం మేరా నామ్ జోకర్ బాల నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన రిషీ కపూర్ ‘బాబీ’ చిత్రంతో హీరోగా మారారు.  నేడు ఆయన ముంబాయి  హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. . కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. 67 ఏళ్ల వయస్సులోనే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

 

తాజాగా బాలీవుడ్ న‌టుడు రిషీ క‌పూర్ హ‌ఠాన్మ‌ర‌ణం త‌న‌ను దిగ్భ్రాంతికి గురిచేసింద‌ని కేంద్ర స‌మాచార ప్రసార శాఖ‌ల మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ చెప్పారు. రిషీ క‌పూర్ గొప్ప న‌టుడు మాత్ర‌మే కాద‌ని, చాలా మంచి మ‌నిషి కూడా అని ఆయ‌న‌ పేర్కొన్నారు. రిషీ క‌పూర్ మ‌ర‌ణం బాలీవుడ్‌కు తీర‌ని లోటని అభిప్రాయ‌ప‌డ్డారు.  కపూర్ ఫ్యామిలీలో రిషీ కపూర్ ఓ ప్రత్యేక స్థానమే కాదు.. కోట్ల మంది ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. రిషిక‌పూర్ కుటుంబ‌స‌భ్యుల‌కు, స్నేహితుల‌కు, అభిమానుల‌కు తాను మ‌న‌సారా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాని జ‌వ‌దేక‌ర్ పేర్కొన్నారు.   

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: