IHG

 

అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోటలో ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది.  షార్ లోని ఘన ఇంధన మోటార్లు తయారుచేసే ఎస్ పీపీ  విభాగంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ పానల్ గదులు దగ్ధం అయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం  సార్ లో ఫైర్ ఆక్సిడెంట్ ని అదుపు చేశారు. యుపిఎస్ లో సాంకేతిక లోపంతో ఆ అగ్ని ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అందులోనే రెండు ఎలక్ట్రికల్ ప్యానెల్ గదులు పూర్తిగా మంటలతో దగ్ధమయ్యాయి అని అధికారులు చెప్పారు. ఎస్ పీపీ లోని ఏపీజీడీ-3 భవనములో అమ్మోనియం పెరా క్లోరైడ్ గ్రైండింగ్ చేస్తుంటారు. ఇది చిన్న యాక్సిడెంట్ కావడంతో సంబంధిత అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: