ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సీపీఐ నేత నారాయణకు ఫోన్ చేయ‌డం ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇంత‌కీ వారిద్ద‌మ‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో చూద్దాం.. ఈ రోజు రాజధాని రైతులకు కౌలు చెల్లించాలంటూ సీపీఐ నేత నారాయ‌ణ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫోన్ చేసి డిమాండ్ చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు. కరోనా సమయంలో అదనంగా డబ్బులు ఇచ్చి అడుకోవాల్సింది పోయి ఇవ్వాల్సినవే ఇవ్వకుంటే ఎలా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇంత‌టి క‌ష్ట కాలంలో ఇలా చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని, అన్నం పెట్టినవారికి సున్నం పెట్టకండని ఆయన హిత‌వు ప‌లికారు.

 

అయితే నారాయణ డిమాండ్‌కి వెంట‌నే స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ స్వ‌యంగా ఫోన్ చేసి నారాయణకు పరిస్థితిని వివరించారట‌. కరోనా వైర‌స్ కార‌ణంగా కార్య‌క‌లాపాల‌న్నీ స్తంభించిపోయాయ‌ని, అందువ‌ల్ల‌నే అమరావతి రైతులకు కౌలు ఇవ్వలేకపోయామని చెప్పిన బొత్స, మే నెలలో అమరావతి రైతులకు కౌలు ఇప్పించే బాధ్యత  త‌న‌దేన‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ మాటిచ్చార‌ట‌.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: